
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: మంత్రి నారా లోకేష్ పర్యటనలో కార్మికుల నిరసనలు.. వాగ్వాదంతో హీటెక్కిన వాతావరణం!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్లాంట్‌లో భద్రతా లోపాలు, కార్మికుల మృతిపై కార్మిక సంఘాలు మంత్రిని నిలదీయగా, ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.



























