
'ఉపా' (UAPA) చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి: ప్రశ్నా రావణ్ అరెస్టుపై మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్ 'ప్రశ్నా రావణ్' వరుస అరెస్టులు, ఆయనపై చట్టవిరుద్ధంగా ఉపా (UAPA) చట్టాన్ని ప్రయోగించడాన్ని మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో పాలకులే స్వయంగా ప్రజా హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. వివాదాస్పద చట్టాల దుర్వినియోగంపై విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
















