
కెమెరాకు చిక్కిన హిమాలయ విధ్వంసం: నేపాల్లో ఆకస్మిక వరదలకు అసలు కారణం ఇదే.. వెలుగులోకి వచ్చిన సంచలన దృశ్యాలు!
నేపాల్లో ఇటీవల సృష్టించిన భీకర ఆకస్మిక వరదలకు (Flash Floods) అసలు కారణం ఏమిటో స్పష్టం చేసే సంచలన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్-చైనా సరిహద్దులోని లాంగ్ టాంగ్ లిరుం ప్రాంతంలో భారీ హిమనది (Glacier) ఒక్కసారిగా కూలిపోవడంతోనే ఈ పెను విపత్తు సంభవించినట్లు శాస్త్రవేత్తలు, వీడియో దృశ్యాలు ధృవీకరించాయి. ఈ విలయం కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించగా, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.



















